పవన్ గురించి ఏం మాట్లాడాలి నేను... సారీ: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

  • నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా
  • పవన్ రెండు చోట్ల ఓడిపోయారు
  • ఆయన గురించి నేనేం మాట్లాడతానన్న చెవిరెడ్డి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమరావతిలోని సెక్రటేరియేట్ వద్ద తనను కలిసిన విలేకరులతో ఆయన ముచ్చటిస్తున్న వేళ, సీఎంపై పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న వ్యాఖ్యల మీద స్పందించాలని మీడియా కోరింది. దీంతో కాస్తంత అసహనాన్ని వ్యక్తం చేసిన చెవిరెడ్డి, తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేతనని, పవన్ రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన వ్యక్తని గుర్తు చేశారు. రెండుసార్లు గెలిచిన తాను, రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి గురించి ఏం మాట్లాడతానని అంటూ, 'సారీ' చెప్పి వెళ్లిపోయారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు స్పందిస్తూ, ఒంటినిండా తిక్క ఉన్న ఓ పిచ్చోడు తమ నాయకుడు జగన్ ను గుర్తిస్తే ఎంత? గుర్తించకుంటే ఎంత? అని మండిపడ్డారు. చంద్రబాబు పెంపుడు ప్యాకేజీగా జగన్ మారిపోయాడని ఆరోపించారు. ఓసారి హిందువుల గురించి, మరోసారి క్రిస్టియన్ల గురించి మాట్లాడుతున్న పవన్, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు చూస్తున్నారని అన్నారు. పవన్‌ కు ధైర్యముంటే, తన రష్యన్‌ భార్యకు పుట్టిన కుమార్తె పాస్‌ పోర్టులో కులం పేరు ఏముందో చెప్పాలని నిలదీశారు.
Go Back to Shorts
Chevireddy
Pawan Kalyan
Jana Sena
Korumutla

More Telugu News